- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతను ఒక సైలెంట్ కిల్లర్.. రూమర్ బాయ్‌ఫ్రెండ్ గురించి త్రిష సెన్సేషనల్ కామెంట్స్..
అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘వర్షం’(Varsham) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. కానీ సడెన్‌గా ఏమైందో ఏమోకానీ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంది. అలా ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగు, తమిళంలో మరిన్ని చిత్రాల్లో కనిపించనుంది. ఇక ఆమె పర్సనల్ విషయానికి వస్తే.. కెరీర్ స్టార్టింగ్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)తో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ వీటిపై ఈ ఇద్దరూ స్పందించకపోవడం, తర్వాత సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో ఆ వార్తలకు చెక్ పడింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి(Vijay Dalapathi)తో ప్రేమలో ఉన్నట్లు కొన్ని పుకార్లు నెట్టింట షికార్లు చేస్తుంది. అంతేకాకుండా వీరిద్దరూ చాలా చోట్ల రెడ్ హ్యాండెడ్‌గా కూడా పట్టుబడ్డారు. అలాగే ఇప్పటి వరకు ఏ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయని ఈ భామ విజయ్ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో చిందులేసింది. దీంతో ఆ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. ఈ క్రమంలో గతంలో ఈ చిన్నది ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
త్రిషను హీరో విజయ్ దళపతి ఫొటోను చూపిస్తూ పలు ప్రశ్నలు అడిగారు యాంకర్. దీంతో విజయ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “విజయ్ ఓ చాలా డిఫరెంట్.. షూటింగ్ సమయంలో అతడు చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. అందుకే అతడిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. కానీ సినిమా కోసం ఎంతో కష్టపడుతుంటారు. అతడు ఎల్లప్పుడూ నాకు సరికొత్తగా కనిపిస్తుంటారు” అంటూ చెప్పుకొచ్చింది. కాగా విజయ్, త్రిష కలిసి దాదాపు 5కి పైగా సినిమాల్లో నటించారు.






