తొలి సినిమా రాకముందే 73 ప్రాజెక్టులు ఒప్పుకున్న మ్యూజిక్ డైరెక్టర్

by Pulgam srinivas |

ఆర్జే బాలాజీ మాట్లాడుతూ… సాయి అభ్యంకర్ మొదటగా మా సినిమాకే సంతకం చేశారని, అది విడుదల కాకముందే ఆయన 73 సినిమాలను ఒప్పుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

తొలి సినిమా రాకముందే 73 ప్రాజెక్టులు ఒప్పుకున్న మ్యూజిక్ డైరెక్టర్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ నటుడు సూర్య తాజాగా ‘కరుప్పు’ అనే చిత్రంలో హీరోగా నటించారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా కనిపించనున్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాను మే 14వ తేదీన తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘వీరభద్రుడు’ అనే టైటిల్‌తో రిలీజ్ చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో నిన్న ఈ మూవీ బృందం చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఆర్జే బాలాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ఆర్జే బాలాజీ మాట్లాడుతూ… “మా సినిమాకు సంగీతం అందించిన సాయి అభ్యంకర్ చాలా వేగంగా ఎదుగుతున్నాడు. మేము ఈ సినిమా ప్రారంభించిన సమయంలోనే ఆయనను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాం. ఆయన కూడా ఒప్పుకొని మా సినిమాకు సంతకం చేశారు. నిజానికి ఆయన సంతకం చేసిన తొలి సినిమా ఇదే. మా సినిమా విడుదల కాకముందే ఆయన 73 సినిమాలను ఒప్పుకునే స్థాయికి ఎదగడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒకసారి నేను ఆయన ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఒక హెలికాప్టర్ కనిపించింది. ఆయన ఏ స్థాయికి ఎదిగాడో చెప్పడానికి అదే ఉదాహరణగా చెప్పొచ్చు. నేను ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్‌ను ఎంపిక చేసుకోవడమే ఈ ప్రాజెక్ట్ ద్వారా నాకు దక్కిన మొదటి విజయంగా భావిస్తున్నాను” అని తెలిపారు. ఆర్జే బాలాజీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story