- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాక్టింగ్‌లో ధనుష్ కంటే ఆయన వందరేట్లు బెటర్ .. నెట్టింట దుమారం రేపుతున్న దర్శకుడి కామెంట్స్
ధనుష్ కంటే ఆయన తండ్రి కస్తూరి రాజా వందరేట్లు బెటర్ అని అన్నారు.

దిశ, సినిమా: స్టార్ హీరో ధనుష్ కోలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా..హీరోగా వరుస సినిమాలు చేస్తూ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. యాక్షన్ ఎమోషన్స్, అన్నింటినీ ఈజీగా హ్యాండిట్ చేయగలగడంతో పాటుగా.. ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయడంలో దిట్ట. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో అయిన ధనుష్ ప్రజెంట్ భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పిస్తున్న ధరుష్‌పై దర్శకుడు మిస్కి్న్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కస్తూరి రాజా కీలక పాత్రలో నటించిన హబిబి చిత్రం ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుంది. మీరా కతిరవన్ తెరకెక్కించిన ఆ మూవీలో కస్తూరి రాజాతో పాటుమాళవిక మనోజ్, ఈషా కీలక పాత్రలో కనిపించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 28న విడుదల కాబోతుంది. ఇక ఈ మూవీ ఈవెంట్‌లో పాల్గొన్న మిస్కిన్ ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. ధనుష్ కంటే ఆయన తండ్రి కస్తూరి రాజా వందరేట్లు బెటర్ అని అన్నారు.
కస్తూరి రాజా చాలా అద్భుతంగా నటిస్తారని.. కానీ ఆయనను మొదటిసారి స్క్రీన్‌పై చూసినప్పుడు ఎవరనేది తెలియకపోయినా, ఎక్కడో చూసినట్లుగా అనిపించిందని గుర్తుచేసుకున్నారు. నటన విషయంలో ఆయన తన కొడుకు ధనుష్ కంటే కూడా ఎంతో మెరుగ్గా చేస్తారని మిస్కిన్ చెప్పారు. అయితే అలా అని తనకు ధనుష్ నటన అంటే ఇష్టం లేదని కాదని, ధనుష్ కూడా మంచి నటుడేనని స్పష్టం చేశారు. కస్తూరి రాజా కెరీర్ మొదట్లో చేసిన సినిమాలేవీ పెద్దగా నచ్చేవి కావని, అన్నీ పనికిరాని చిత్రాలే చేశారని అభిప్రాయపడ్డారు. కాకపోతే, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను తన సినిమాలకు ఎంచుకోవడం ఆయనకు బాగా ప్లస్ అయిందని, అలా మెల్లగా పరిశ్రమలో సొంత గుర్తింపు తెచ్చుకుంటూ మంచి సంపాదన కూడా తెచ్చుకున్నారని అన్నారు. ఇక తన సినిమాల్లో వచ్చే నష్టాల గురించి మాట్లాడుతూ.. కొన్నిసార్లు కేవలం ఆత్మసంతృప్తి కోసమే చిత్రాలు చేస్తుంటామని, అలాంటప్పుడు నష్టాలు రావడం సహజమని పేర్కొన్నారు. అలాంటి సమయాల్లో అప్పులు తీర్చుకోవడానికి, మళ్లీ జేబు నింపుకోవడానికి వెంటనే పక్కా కమర్షియల్ సినిమాలు చేయడం ఒక మార్గమని చెప్పుకొచ్చారు.






