ఎవరు లేని సమయంలో రూమ్‌లోకి వచ్చాడు.. చేదు అనుభవాన్ని పంచుకున్న కాజల్ అగర్వాల్!

by Pulgam srinivas |

ఓ అసిస్టెంట్ డైరెక్టర్ అనుమతి లేకుండా క్యారవాన్‌లోకి వచ్చి తన ఛాతిపై ఉన్న టాటూను చూపించాడని కాజల్ అగర్వాల్ చెప్పింది.

ఎవరు లేని సమయంలో రూమ్‌లోకి వచ్చాడు.. చేదు అనుభవాన్ని పంచుకున్న కాజల్ అగర్వాల్!
X

దిశ, వెబ్ డెస్క్: తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అతికొద్ది మంది కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు సినిమాలతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ భామ, అనంతరం పలు భాషల్లో నటించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్, తన కెరీర్‌లో జరిగిన ఓ షాకింగ్ సంఘటనను గుర్తు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించాను. ఆ సినిమా తొలి రోజు షూటింగ్ పూర్తయ్యాక నేను నా క్యారవాన్‌లోకి వెళ్లి కూర్చున్నాను. కొద్దిసేపటికే ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ నా అనుమతి లేకుండా క్యారవాన్ తలుపు తెరిచి లోపలికి వచ్చాడు.

వెంటనే తన షర్ట్ విప్పి, ఛాతిపై నా పేరు పచ్చబొట్టు వేయించుకున్నట్లు చూపించాడు. అది చూసి నేను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను. అభిమానులు ప్రేమ చూపించడం ఆనందంగా ఉంటుంది. కానీ నా అనుమతి లేకుండా అలా ఒక్కసారిగా నా వ్యక్తిగత స్థలంలోకి రావడం వల్ల నేను భయపడ్డాను. తర్వాత అతనికి ప్రశాంతంగా ఇలాంటి పని మళ్లీ చేయకూడదని చెప్పి పంపించాను. అది నా జీవితంలో జరిగిన అత్యంత షాకింగ్ సంఘటనల్లో ఒకటని కాజల్ తెలిపింది. ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే, ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'ది ఇండియా స్టోరీ' చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

Next Story