ప్రేమ కోసం ఆయన సినిమా వదులుకోలేదు.. 'సైఫ్ ఆలీ ఖాన్'పై సంచలన ఆరోపణలు చేసిన స్టార్ డైరెక్టర్

by Pulgam srinivas |

సైఫ్ అలీ ఖాన్ కి అస్సలు క్రమశిక్షణ ఉండేది కాదు. ఆయన షూటింగుకు సరైన సమయానికి వచ్చేవాడు కాదు. అందుకే ఆయన్ని తీసేసి వేరే వారిని పెట్టుకున్నామని దర్శకుడు రాహుల్ రావాలి చెప్పుకొచ్చాడు.

ప్రేమ కోసం ఆయన సినిమా వదులుకోలేదు.. సైఫ్ ఆలీ ఖాన్పై సంచలన ఆరోపణలు చేసిన స్టార్ డైరెక్టర్
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి చాలా విజయాలను అందుకున్నారు. ఈ మధ్యకాలంలో ఈ నటుడు విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. కొంతకాలం క్రితమే ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురుష్, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ 1 చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. 1993వ సంవత్సరం పరంపర అనే చిత్రంతో ఈయన ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఈ సినిమా కంటే ముందే ఈ హీరో ఒక భారీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాల్సి ఉంది.

కానీ ఆ చిత్రం స్టార్ట్ అయ్యాక కొన్ని కారణాలవల్ల అందులో నుండి ఆయనను తీసేసి వేరే హీరోతో ఆ సినిమాను పూర్తి చేశారు. ఆ సమయంలో సైఫ్ అలీ ఖాన్ ని మూవీ నుంచి తప్పించడానికి దర్శకుడు ప్రధాన కారణమని, దర్శకుడు సైఫ్ ప్రస్తుతం ప్రేమిస్తున్న అమ్మాయికి బ్రేకప్ చెబితేనే నువ్వు ఈ సినిమాలో కంటిన్యూ కావాలని, లేకపోతే నిన్ను తీసేస్తామని కండిషన్ పెట్టినట్లు, దానికి ఈ నటుడు ఒప్పుకోకపోవడంతో ఆ సినిమా నుండి దర్శకుడు ఆయనను తీసేసాడని వార్త పెద్ద ఎత్తున వైరల్ అయింది.

తాజాగా సైఫ్ మొదటి సినిమాగా రావాల్సిన 'బేఖుది' చిత్ర దర్శకుడు రాహుల్ రవాలి ఒక ఇంటర్వ్యూలో ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ తన ప్రేమ కోసం మొదటి సినిమా నుండి తప్పుకున్నాడు అనేది పూర్తిగా అవాస్తవం. ఆయనకు అస్సలు బాధ్యత ఉండేది కాదు. సినిమా షూటింగ్కు ఎప్పుడూ సమయానికి వచ్చేవాడు కాదు. అలాగే ఆయన నటనపరంగా మంచి టాలెంటెడ్ అయినా కూడా అసలు క్రమశిక్షణ ఉండేది కాదు. అందుకే ఆయనను సినిమా నుండి తీసేసి వేరే హీరోను పెట్టుకున్నామని ఈ చిత్ర దర్శకుడు చెప్పుకొచ్చాడు.

Next Story