ప్రెగ్నెంట్ ఉన్న టైంలో నన్ను అతను ఇబ్బంది పెట్టాడు.. నొప్పిగా ఉందన్న కనికరించలేదు.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ప్రెగ్నెంట్ ఉన్న టైంలో నన్ను అతను ఇబ్బంది పెట్టాడు.. నొప్పిగా ఉందన్న కనికరించలేదు.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. టాలీవుడ్‌లో ‘రక్త చరిత్ర’(Raktha Charithra) అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘రక్త చరిత్ర-2’, ‘ధోని’, ‘లెజెండ్’, ‘లయన్’, ‘కబాలి’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అలా హిందీతో పాటుగా బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయాళం, తెలుగు చిత్రాల్లో నటించారు. ఇదిలా ఉంటే.. తాజాగా నటి నేహా ధూపియా హోస్ట్ చేస్తున్న ఓ చిట్ చాట్‌ షోలో ఇటీవల రాధిక ఆప్టే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తన గర్భధారణ సమయంలో జరిగిన అనుభవం గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ''నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఓ హిందీ సినిమాలో నటిస్తున్నా. ఈ విషయం తెలిసి ఆ చిత్ర నిర్మాత హ్యాపీగా లేడు. నన్ను కసురుకున్నాడు. షూటింగ్‌లో అసౌకర్యంగా ఉబ్బరం ఉన్నప్పటికీ నేను టైట్ దుస్తులు ధరించాలని పట్టుబట్టాడు. అప్పుడు నాకు మూడో నెల. ఆ సమయంలో నేను బాగా తినడం వల్ల నా శరీరంలో కాస్త మార్పులు వచ్చాయి.

కానీ ఆయన ఈ విషయం అర్థం చేసుకోవడానికి బదులుగా, నాపై అసహనం ప్రదర్శించారు. నేను సెట్‌లో నొప్పితో బాధపడుతున్నా, అసౌకర్యంగా ఉన్నా డాక్టర్ని కలిసేందుకు కూడా ఒప్పుకోలేదు. నొప్పిగా ఉన్నా కూడా షూటింగ్ అలాగే కొనసాగించారు. అది నన్ను నిజంగా ఎంతో బాధపెట్టింది'' అని రాధికా ఆప్టే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story