ఈ సినిమా థియేటర్‌లో యూత్‌ఫెస్టివల్‌లా ఉంటుంది.. పతంగ్‌పై హైప్ పెంచేస్తున్న నిర్మాత కామెంట్స్

by Chukka Sudharani |

అందరిలో ఎంతో మమేకమైన ప‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా (Sports drama) చిత్రం ‘ప‌తంగ్’.

ఈ సినిమా థియేటర్‌లో యూత్‌ఫెస్టివల్‌లా ఉంటుంది.. పతంగ్‌పై హైప్ పెంచేస్తున్న నిర్మాత కామెంట్స్
X

దిశ, సినిమా: అందరిలో ఎంతో మమేకమైన ప‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా (Sports drama) చిత్రం ‘ప‌తంగ్’ (Patang). ప్రణీత్ ప్రత్తిపాటి (Praneet Prattipati) దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాను సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్నర‌ప్ ప్రణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్, ఎస్‌పీ చరణ్ తదితర నూతన నటీనటులు ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌ (Summer special)గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ‘పతంగ్’ నుంచి ‘హవ హవ’ (Hawa Hawa) అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్‌. సంగీత దర్శకుడు జోస్‌ జిమ్మీ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు ఆయనే సాహిత్యం సమకూర్చి ఆలపించాడు. సినిమాలో ఈ సాంగ్‌ ఎంతో యూత్‌ఫుల్‌గా ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన పాటలకు, టీజర్‌ (teaser)కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా థియేటర్‌ (theater)లో యూత్‌ఫెస్టివల్‌ (Youth Festival)లా ఉంటుంది. కొత్తవాళ్లతో చేసిన మా సినిమా కొత్తగా ఉండ‌టంతో పాటు చాలా పెద్ద సినిమా క్వాలిటీతో ఉంటుంది అన్నారు. ఈ సినిమాకు క‌థే హీరో. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం. త‌ప్పకుండా మా ప‌తంగ్ చిత్రం అన్నివ‌ర్గాల వారిని అల‌రిస్తుంద‌నే న‌మ్మకం ఉంది. కొత్త కంటెంట్‌ను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.

Next Story