LYF Teaser : ఎస్పీ చరణ్ ‘లవ్ యువర్ ఫాదర్’.. టీజర్ చూశారా?

by Phanindra |   (  Updated:2025-08-01 04:52:47  IST  )

దివంగత గాయకుడు ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ నటిస్తున్న మూవీ ‘LYF’ – లవ్ యువర్ ఫాదర్.

LYF Teaser : ఎస్పీ చరణ్ ‘లవ్ యువర్ ఫాదర్’.. టీజర్ చూశారా?
X

దిశ, వెబ్ డెస్క్ : దివంగత గాయకుడు ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ ( S. P. Charan ) నటిస్తున్న మూవీ ‘LYF’ లవ్ యువర్ ఫాదర్ ( Love You Father ) ఈ మూవీలో చరణ్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. మనీషా ఆర్ట్స్ & మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ పతాకం పై కిషోర్ రాటి, మహేష్ రాటి, ఏ రామస్వామి రెడ్డి నిర్మించారు. పవన్ కేతరాజు డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది.

ఈ మూవీలో ప్రవీణ్, భద్రం, నవాబ్ షా, షకలక శంకర్, రవిబాబు, రియా.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి మణిశర్మ మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా, సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. " మంచి కథతో తక్కువ బడ్జెట్ లో సినిమాలు నిర్మిస్తే ఎవరికీ సమస్యలు రావు. ఎక్కువ బడ్జెట్ పెట్టి టికెట్ రేట్ల కోసం మళ్ళీ ప్రభుత్వాన్ని అడగడం కంటే తీసే సినిమాల్లోనే మంచివి తీసుకు రావడం మంచిది. ఈ LYF మూవీ తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్ తో వస్తున్న మూవీ. ఇలాంటి మూవీస్ ఎవరూ తీసినా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఎంకరేజ్ చేయడంలో నేను ముందుంటాను. తక్కువ బడ్జెట్ తో మన ముందుకొచ్చే చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధిస్తాయని" అన్నారు.

Next Story