Bhairavam Teaser : వాడి జోలికి ఎవరైనా వస్తే ప్రాణాలు తీస్తా అంటున్న మంచు మనోజ్.. ‘భైరవం’ టీజర్ చూశారా?

by Phanindra |   (  Updated:2025-08-01 04:54:02  IST  )

చుట్టూ తెగిపడిన తలలు, మొండాలు.. దూరంగా మృత్యువు తెలియని కాలాన్ని జయించిన కృష్ణుడిలా శంఖం

Bhairavam Teaser : వాడి జోలికి ఎవరైనా వస్తే ప్రాణాలు తీస్తా అంటున్న మంచు మనోజ్.. ‘భైరవం’ టీజర్ చూశారా?
X

దిశ, వెబ్ డెస్క్ : హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ( Bellamkonda Sai Sreenivas ) సరైన హిట్ పడలేదు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా.. ప్రేక్షకుల కోసం సినిమాలను చేస్తూనే ఉన్నాడు. సోలో హీరోగా సినిమాలు కలిసి రావడం లేదని, రూటు మార్చి మల్టీ స్టారర్ ఎంచుకుని " భైరవం " ( Bhairavam ) మూవీతో మన ముందుకొస్తున్నాడు. తాజాగా, ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

సాయి శ్రీనివాస్ తో పాటు హీరో మంచు మనోజ్ ( Manchu Manoj ) , నారా రోహిత్ ( Nara Rohith ) కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో నారా రోహిత్ కి జోడిగా దివ్య పిళ్ళై, శ్రీనివాస్ జంటగా అదితి శంకర్, ఇక మనోజ్ సరసన ఆనంది.. ఇలా ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. జయసుధ కీలక పాత్రలో నటిస్తుంది. భైరవం మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకం పై KK రాధామోహన్ నిర్మించారు. ఈ మూవీకి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు.

టీజర్లో జయసుధ వాయిస్ తో.. రాత్రి నాకు ఒక కల వచ్చింది. చుట్టూ తెగిపడిన తలలు, మొండాలు.. దూరంగా మృత్యువు తెలియని కాలాన్ని జయించిన కృష్ణుడిలా శంఖం పూరించుకుంటూ వెళ్ళిపోతున్నాడురా శ్రీను.. అంటూ మొదలైంది. యాక్షన్ సీన్స్ ను బాగా చూపించారు. వారాహి గుడి, బ్యాక్ డ్రాప్ లో ఒక ఊరు, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండనుందని తెలుస్తుంది. ఈ హీరోలు ముగ్గురు అన్నదమ్ములుగా నటించినట్టు, ఒకరి కోసం ఒకరు నిలబడినట్టు చూపించారు. దీంతో ఈ ముగ్గురు హీరోలు కలిసి భారీ యాక్షన్ సినిమా తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.

Next Story