L2: Empuraan: లూసిఫర్ 2 టీజర్ చూశారా..  అబ్రహం మళ్ళీ వచ్చేస్తున్నాడు..

by Phanindra |   (  Updated:2025-08-02 15:54:09  IST  )

మలయాళం స్టార్ హీరో మోహ‌న్ లాల్ ( Mohanlal ) ప్రధాన పాత్రలో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ " లూసిఫర్‌ "

L2: Empuraan: లూసిఫర్ 2 టీజర్ చూశారా..  అబ్రహం మళ్ళీ వచ్చేస్తున్నాడు..
X

దిశ, వెబ్ డెస్క్ : మలయాళం స్టార్ హీరో మోహ‌న్ లాల్ ( Mohanlal ) ప్రధాన పాత్రలో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ " లూసిఫర్‌ " ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. కరోనా సమయంలో ఓటీటీలోకి వచ్చి పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు, ఈ మూవీకి సీక్వెల్ ను కూడా ప్రకటించారు. సీక్వెల్ చిత్రం ‘లూసిఫర్ 2 : ఎంపురాన్‌’ ( L2: Empuraan ) అనే టైటిల్‌ తో మన ముందుకు రాబోతుంది. తాజాగా, ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

టీజర్ చూస్తుంటే.. పార్ట్ 1 నుంచి లీడ్ తీసుకొని హీరో స్టీఫెన్ రాజకీయాలను ఎలా మార్చాడు? అసలు అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అబ్రహం ఖురేషిగా ఎందుకు మారాడు? అనేది కథ. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో మూవీ పై భారీ అంచనాలు పెరిగాయి. ఇది పార్ట్ 1 కి మించి ఉండబోతుందని తెలుస్తుంది.

ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో మంజు వారియర్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్.. లాంటి పెద్ద స్టార్స్ నటిస్తున్నారు. పార్ట్ 1 మళయాళంలోనే విడుదలవ్వగా " లూసిఫర్ 2 " మాత్రం పాన్ ఇండియాగా రిలీజ్ చేయనున్నారు. ఇక, ఈ మూవీ మార్చి 27 థియేటర్లలో విడులవుతుందని ప్రకటించారు.

Click For Video....

Next Story