- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెక్స్ట్ సంక్రాంతి సినిమాల్లో ఉన్న ఆ కామన్ పాయింట్ గమనించారా
వచ్చే సంక్రాంతికి చిరు - బాబి, బాలయ్య - గోపీచంద్ మలినేని, వెంకీ - అనిల్ రావిపూడి, నాగ్ - కళ్యాణ్ కృష్ణ మూవీలు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కాంబో మూవీస్ సంక్రాంతికి వచ్చి విజయాలు అందుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కళకళలాడుతూ ఉంటాయి. అందుకు ప్రధాన కారణం సంక్రాంతి సమయంలో మన తెలుగు ప్రజలు సినిమాలు చూడడానికి అత్యంత ఆసక్తి చూపించడంతో ఆ సమయంలో విడుదలైన చిత్రాలకి మంచి కలెక్షన్లు వస్తుంటాయి. దానితో అనేకమంది మేకర్స్ ఆ సీజన్ని టార్గెట్ చేస్తుంటారు. కొన్ని రోజుల క్రితమే సంక్రాంతి పండగ పూర్తయింది. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలలో చాలా సినిమాలు మంచి వసూళ్లను రాబట్టాయి. సంక్రాంతి పండుగ పూర్తి అయ్యి కొన్ని రోజులే అవుతున్నా ఇప్పుడే వచ్చే సంక్రాంతికి సినిమాలు రెడీ అవుతున్నాయి.
ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఈ నలుగురు సీనియర్ హీరోల సినిమాలు కూడా సంక్రాంతి పండుగకు రావడానికి దాదాపు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎప్పుడూ కూడా సంక్రాంతి పండుగకు ఈ నలుగురు సీనియర్ హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడలేదు. మొదటిసారి ఈ నలుగురు హీరోలు సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ దగ్గర తలపడబోతున్నారని ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త నిజమైతే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు థియేటర్ల వద్ద ఎలాంటి వాతావరణం ఉంటుందో అని ఎంతో మంది ఆత్రుతగా చూస్తున్నారు. వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదల కాబోయే ఈ నాలుగు సినిమాల మధ్య ఒక చిన్న కామన్ పాయింట్ ఉంది.
అదేంటో తెలుసా..? అది తెలుసుకుందాం... చిరు - బాబి, బాలయ్య - గోపీచంద్ మలినేని, వెంకటేష్ - అనిల్ రావిపూడి, నాగార్జున - కళ్యాణ్ కృష్ణ కాంబోలో సినిమాలు రానున్నాయి. వీటిలో వెంకటేష్ - అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ మిగతా మూడింటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చాయి. ఇప్పటికే ఈ కాంబోలో రూపొందిన సినిమాలు సంక్రాంతి పండుగకు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. ఈ నాలుగు సినిమాల మధ్య ఉన్న ఆ చిన్న కామన్ పాయింట్ అదే.






