గట్టిగా నిలబడిపోయిన ‘లెనిన్’.. అక్కినేని అఖిల్ సినిమా గ్లింప్స్‌ ‘పెద్ది’ని చేరుకున్నాయా?

by Mallepaka Hamsa |

అక్కినేని అఖిల్(Akkineni Akhil) రెండేళ్ల తర్వాత ‘లెనిన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

గట్టిగా నిలబడిపోయిన ‘లెనిన్’.. అక్కినేని అఖిల్ సినిమా గ్లింప్స్‌ ‘పెద్ది’ని చేరుకున్నాయా?
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్(Akkineni Akhil) రెండేళ్ల తర్వాత ‘లెనిన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ చిత్రాన్ని ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళి కిశోర్ అబ్బూరు(Murali Kishore Abburu) తెరకెక్కిస్తున్నారు. దీనిని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున్(Akkineni Nagarjuna), సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తుండగా.. అఖిల్ నటిస్తున్న 6వ చిత్రంగా రాబోతుంది. ఇక ఇందులో క్రేజీ బ్యూటీ శ్రీలీల(sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ ఇటీవల అఖిల్ పుట్టినరోజు కానుకగా విడుదలై అంచనాలను పెంచేశాయి. ఇక ఇందులో అఖిల్ చెప్పిన డైలాగ్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక అఖిల్ లుక్ మాత్రం సినీ ప్రియులను ఫిదా చేసిందని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. ‘లెనిన్’విడుదలైన 24 గంటల్లోనే 11మిలియన్ల వ్యూస్ రాబట్టడంతో పాటు టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘గట్టిగా నిలబడిపోయింది’’అనే క్యాప్షన్ జత చేసి ఫైర్ ఎమోజీ షేర్ చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ సినిమా గ్లింప్స్ రామ్ చరణ్ ‘పెద్ది’కంటే తక్కువనే వచ్చాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇటీవల ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇక ‘పెద్ది’ ఏకంగా 36 మిలియన్లు సాధించిన విషయం తెలిసిందే. ఇక అక్కినేని అఖిల్ గ్లింప్స్ మాత్రం 11 మిలియన్ల వ్యూస్ మాత్రమే సాధించాయి.

Next Story