- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'పుష్ప 2' సెట్ చేసిన రికార్డు… అన్‌టచబుల్‌గా మారిందా?
బుక్‌మైషోలో 'పుష్ప 2' చిత్రానికి సంబంధించిన 20 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటివరకు ఇందులో ఏ భారతీయ సినిమాకు కూడా ఈ స్థాయిలో టికెట్ సేల్స్ జరగలేదు.

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప ది రూల్’ ఏ స్థాయి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కలెక్షన్ల పరంగా ఈ సినిమాకు ముందు వరుసలో ‘దంగల్’, ‘బాహుబలి 2’ వంటి చిత్రాలు ఉన్నాయి. అయితే ఒక ప్రత్యేకమైన విషయంలో మాత్రం 'పుష్ప 2' భారతీయ సినిమాల్లోనే నెంబర్ వన్‌గా నిలిచింది. ఇప్పట్లో ఆ రికార్డును క్రాస్ చేయడం అంత ఈజీ కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం సాధించిన భారీ రికార్డు ఏంటంటే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ అయిన బుక్‌మైషోలో 20 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం.
అప్పటివరకు ఏ భారతీయ సినిమాకు కూడా ఈ స్థాయిలో టికెట్ సేల్స్ జరగలేదు. ఇటీవల విడుదలైన 'ధురంధర్ 2' ఈ రికార్డును బ్రేక్ చేస్తుందని అంచనాలు వచ్చినా, ఆ చిత్రం కూడా ఈ రికార్డు దరిదాపుల్లోకి రాలేకపోయింది. దాంతో మరికొన్ని సంవత్సరాల పాటు ఈ రికార్డు 'పుష్ప 2' పేరిటే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, ఫహద్ ఫాజిల్, సునీల్, రావు రమేష్, అనసూయ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.






