అల్లు అర్జున్- బాసిల్ జోసెఫ్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా? ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

by Mallepaka Hamsa |

ఆయన ICON అని రాసి ఉన్న ఒక క్యాప్ ఫొటోను షేర్ చేస్తూ.. ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు.

అల్లు అర్జున్- బాసిల్ జోసెఫ్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా? ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- మలయాళ స్టార్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రాబోతోందని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుందని చిత్ర బృందం ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో, ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందని, దర్శకుడు బాసిల్ జోసెఫ్ ఈ కథను వేరే హీరో దగ్గరకు తీసుకెళ్లారంటూ నెట్టింట కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ రూమర్లపై దర్శకుడు బాసిల్ జోసెఫ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన ICON అని రాసి ఉన్న ఒక క్యాప్ ఫొటోను షేర్ చేస్తూ.. ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు. టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్ అనేది కేవలం అల్లు అర్జున్ బిరుదు మాత్రమే కావడంతో.. బాసిల్ పెట్టిన ఈ పోస్ట్ బన్నీతో చేయబోయే సినిమా గురించేనని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. కాగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ తన చేతిలో ఉన్న వేర్వేరు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఆయన ‘రాకా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బన్నీ కెరీర్‌లో 22వ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమా తర్వాత, ఆయన టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో తన AA23వ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ రెండు పెద్ద సినిమాలు పూర్తిగా పూర్తయిన తర్వాతే బాసిల్ జోసెఫ్‌తో చేయబోయే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ లెక్కన బాసిల్ జోసెఫ్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే మైల్‌స్టోన్ మూవీగా, అంటే 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా లేట్ అయినా సరే, ప్రాజెక్ట్ మాత్రం పక్కాగా ఉంటుందని డైరెక్టర్ స్వయంగా హింట్ ఇవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story