- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చందు మొండేటి, నాగవంశీ ‘వాయుపుత్ర’ నిలిచిపోయిందా?
‘కార్తికేయ 2’, ‘తండేల్’ వంటి బ్లాక్ బస్టర్ విజయాలు బాక్సాఫీస్‌కు అందించిన దర్శకుడు చందు మొండేటి.. హనుమంతుడి కథతో ‘వాయుపుత్ర’ అనే ప్రతిష్టాత్మక 3D యానిమేషన్ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ‘కార్తికేయ 2’, ‘తండేల్’ వంటి బ్లాక్ బస్టర్ విజయాలు బాక్సాఫీస్‌కు అందించిన దర్శకుడు చందు మొండేటి.. హనుమంతుడి కథతో ‘వాయుపుత్ర’ అనే ప్రతిష్టాత్మక 3D యానిమేషన్ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ పౌరాణిక చిత్రాన్ని 2026 దసరా స్పెషల్‌గా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం & కన్నడ భాషలలో థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తుంది.
సప్త చిరంజీవులలో ఒకరైన హనుమంతుడి పరాక్రమం, భక్తి, చారిత్రక ఇతిహాసాల ఆధారంగా ఈ చిత్రం ఉంటుంది. ఇందులో హనుమంతుడి పాత్రను అద్భుతమైన విజువల్స్‌తో, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుండగా దీనిని భారీ బడ్జెట్‌తో రూపొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ సూపర్ హీరో ప్రాజెక్ట్ బడ్జెట్ సమస్యల కారణంగానే ఆగిపోయినట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాక ఫస్ట్ లుక్ పోస్టర్ తప్పా మరో అప్డేట్ రాలేదు. దీంతో వాయుపుత్ర నిలిచిపోయిందన్న వార్తలు ఊపందుకున్నాయి. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.






