- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనేక సంవత్సరాల తర్వాత కూడా పవన్ నన్ను గుర్తుపట్టి ఎలా ఉన్నావు అని అడిగాడు.. హర్షవర్ధన్
హర్షవర్ధన్ మాట్లాడుతూ... గుడుంబా శంకర్ స్టోరీ డిస్కషన్‌లో పవన్‌తో కలిసి వారం రోజులు పనిచేశాను. ఆ తర్వాత గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో ఆయన నన్ను గుర్తుపట్టి ఎలా ఉన్నావు అని అడిగారని ఈ నటుడు చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, రచయితగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో హర్షవర్ధన్ ఒకరు. ఈయన కొంతకాలం క్రితం సుధీర్ బాబు హీరోగా రూపొందిన మామ మశ్చీంద్ర అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ నటుడు చిరంజీవి హీరోగా రూపొందిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది.
తాజాగా హర్షవర్ధన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్, నాగబాబు గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు. హర్షవర్ధన్ మాట్లాడుతూ... కొన్ని సంవత్సరాల క్రితం నాగబాబు గారు "నీలో మంచి టాలెంట్ ఉంది, నువ్వు మంచి స్థాయికి వెళతావు" అన్నారు. అనడం మాత్రమే కాకుండా గుడుంబా శంకర్ సినిమాలో రైటింగ్ డిపార్ట్మెంట్లో నన్ను కూడా తీసుకున్నారు.
ఇక నేను వారం రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారితో స్టోరీ డిస్కషన్లో పాల్గొన్నాను. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆ సినిమా పూర్తయిన తర్వాత అనేక సంవత్సరాలకు గబ్బర్ సింగ్ సినిమాలో నేను ఒక చిన్న పాత్రలో నటించాను. ఆ షూటింగ్ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ నా దగ్గరకు వచ్చి "ఎలా ఉన్నావు" అని అడిగారు. అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన నన్ను గుర్తుపట్టి ఎలా ఉన్నావు అని అడగడం ఆయన గొప్పతనమని హర్షవర్ధన్ తాజాగా చెప్పుకొచ్చాడు.






