- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ మృతి
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చాలా చిన్న వయసులోనే ఈ ప్రపంచానికి వీల్కోలు పలికాడు ప్రముఖ సింగర్ హర్మన్ సిద్ధూ. 37 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. 2007 నుంచి ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన హర్మన్

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చాలా చిన్న వయసులోనే ఈ ప్రపంచానికి వీల్కోలు పలికాడు ప్రముఖ సింగర్ హర్మన్ సిద్ధూ. 37 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. 2007 నుంచి ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన హర్మన్.. ప్రజల మనసులో ప్రత్యేకంగా నిలిచిపోయాడు.
పంజాబ్ సింగర్ అయిన హర్మన్.. తన సొంత గ్రామానికి కారులో తిరిగి వస్తుండగా.. కారు ట్రక్కును ఢీకొంది. కారు వేగం కారణంగా ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తుంది. విషయం తెలిసిన అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ‘కోయి చక్కర్ నహీ’, ‘బేబే బాపు’,‘బబ్బర్ షేర్’, ‘ముల్తాన్ వర్సెస్ రష్యా’ వంటి అద్భుతమైన పాటలు పాడిన హర్మన్‌కు భార్య, పాప ఉన్నారు. ఆయన సోషల్ మీడియాలో చివరగా తన కుమార్తెతో కనిపించడం విశేషం. కాగా ఇప్పుడు అదే పోస్ట్ వైరల్ అవుతోంది.






