- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Shankar : అలా చేసుంటే నా పేరు వేసుకునేవాడిని కాదు.. ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో జరిగింది అదే
Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఏ మూవీకి రీమేక్ కాదు. పూర్తిగా కొత్త కథతో తెరకెక్కింది అని హరీష్ శంకర్ తాజాగా చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో హరీష్ శంకర్ ఒకరు. 'షాక్'తో దర్శకుడిగా కెరీర్ను ప్రారంభించి 'మిరపకాయ్'తో మొదటి సక్సెస్ను అందుకున్నాడు. ఆ తర్వాత 'గబ్బర్ సింగ్'తో బ్లాక్ బాస్టర్ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా హిందీ మూవీ అయిన 'దబాంగ్'కి అధికారిక రీమేక్గా రూపొందింది. ప్రస్తుతం ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా జంటగా 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
ఈ మూవీని మార్చి 26వ తేదీన విడుదల చేయనున్నారు. గత కొంతకాలంగా ఈ సినిమా తమిళ మూవీ అయిన 'తేరి'కి రీమేక్గా రూపొందుతుందని పెద్ద ఎత్తున ఓ వార్త వైరల్ అయ్యింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా హరీష్ శంకర్ అనేక మంది సినిమా జర్నలిస్టులతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన ఈ చిత్రం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా హరీష్ శంకర్ గారికి 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం 'తేరి'కి రీమేక్ అని వార్తలు వస్తున్నాయి, అది నిజమేనా అనే ప్రశ్న ఎదురయింది.
దానికి ఆయన సమాధానం చెబుతూ... నాకు ఏదైనా సినిమా నచ్చి, దానిని రీమేక్ చేయాలి అనుకున్నట్లయితే మాటలు, మార్పులు, దర్శకత్వం అని నా పేరు పడుతూ ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం నేను అలా వేసుకోలేదు, అక్కడే మీకు అర్థం కావాలి అది ఏ సినిమాకు రీమేక్ కాదని. ఈ సినిమా కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అద్భుతమైన రీతిలో జనాలను ఆకట్టుకోబోతుంది అని ఆయన చెప్పుకొచ్చాడు.






