విడుదలకు సిద్ధంగా ‘హరిహర వీరమల్లు’.. AM రత్నంకు అస్వస్థత అంటూ పుకార్లు

by Kema Shiva Kumar |

హరిహర వీరమల్లు (Harihara Veeramallu) నిర్మాత, మెగా సూర్య ప్రొడక్షన్స్ అధినేత ఏఎం రత్నం (AM Rathnam) అస్వస్థతకు గురయ్యారనే వార్తలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

విడుదలకు సిద్ధంగా ‘హరిహర వీరమల్లు’.. AM రత్నంకు అస్వస్థత అంటూ పుకార్లు
X

దిశ, వెబ్‌డెస్క్: హరిహర వీరమల్లు (Harihara Veeramallu) నిర్మాత, మెగా సూర్య ప్రొడక్షన్స్ అధినేత ఏఎం రత్నం (AM Rathnam) అస్వస్థతకు గురయ్యారనే వార్తలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఆయన కళ్లు తిరిగి పడిపోవడంతో హైదరాబాద్‌ (Hyderabad)లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏఎం రత్నం ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఆయన సోదరుడు దయాకర్ రావు (Dayakar Rao) ఖండించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. తన అన్న ఏఎం రత్నం అస్వస్థతకు గురయ్యారని, స్పృహ కోల్పోయాడని వస్తున్న పుకార్లను నమ్మవద్దని అన్నారు.

ఆయన పూర్తిగా ఆరోగ్యంగా.. క్షేమంగా ఉన్నారని తెలిపారు. దయచేసి ఏఎం రత్నంపై అవాస్తవాలను ప్రచారం చేయవద్దని దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రస్తుతం తెలుగులో ఆయన సమర్పణలో తెరకెక్కిన హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న విడుదలకు సిద్ధంగా ఉంది. మూవీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) కథానాయకుడి పాత్ర పోషిస్తుండటంతో భారీగా అంచనాలు ఉన్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తుండగా.. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలను పోషించారు. టాలీవుడ్ ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి స్వరాలను సమకూర్చారు.

Next Story