Hari Hara Veera Mallu worldwide box office collection : ‘హరి హర వీరమల్లు’ కలెక్షన్లు..ఎన్ని కోట్ల అంటే

by velandi.Saikiran |   (  Updated:2025-07-28 15:06:54  IST  )

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా గత వారం రిలీజ్

Hari Hara Veera Mallu worldwide box office collection : ‘హరి హర వీరమల్లు’ కలెక్షన్లు..ఎన్ని కోట్ల అంటే
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా గత వారం రిలీజ్ అయి... సక్సెస్ ఫుల్ గా దూసుకు వెళుతోంది. ఈ సినిమాలో.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా మెరిసారు. ఈ సినిమాకు దర్శకులుగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ ఇద్దరు దర్శకులుగా వ్యవహరించారు. ఇక నిర్మాతగా ఏ ఎమ్ రత్నం ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీత స్వరాలు అందించారు.

అయితే సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హరిహర వీరమల్లు నాలుగు రోజుల కలెక్షన్స్... 105 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు... ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మొత్తంగా 51% ఈ సినిమా రికవరీ చేసిందని కూడా చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో 78.30 కోట్లు ఈ సినిమా రాబట్టింది. బ్రేక్ ఈవెన్ చేయాలంటే... ఇంకా 62.48 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని అంచనా వేస్తున్నారు. ఇక ఈనెల 24వ తేదీన... హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది.

Next Story