- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan:‘హరిహర వీరమల్లు’ ఆఖరి షెడ్యూల్ ప్రారంభం..!
పవర్ స్టార్(Pawer Star) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ పార్ట్-1 షూటింగ్ తుది దశకు చేరుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: పవర్ స్టార్(Pawer Star) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ పార్ట్-1 షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ రోజు(ఫిబ్రవరి 05) నుంచి మూవీ ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. పవన్ కల్యాణ్ త్వరలో నే షూటింగ్‌లో చేరనున్నట్లు సమాచారం. ఈ నెలఖారు వరకు జరిగే ఈ షెడ్యూల్ పూర్తయితే మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కానున్నట్లు తెలుస్తోంది. జ్యోతి కృష్ణ(Jyoti Krishna) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా, బాబీ డియోల్(Babi Diol) కీలక పాత్రలో నటిస్తున్నారు.
‘హరి హర వీరమల్లు’ సినిమా వచ్చే నెల(మార్చి) 28వ తేదీన విడుదల చేస్తారన్న సంగతి తెలిసిందే. విడుదల తేదీకి సినిమా రిలీజ్(Movie) అవుతుందా అనే పలు సందేహాలు ప్రేక్షకుల్లో ఉండే.. కానీ ఇటీవల ఈ మూవీ పీఆర్వో, పవన్ కళ్యాణ్ పీఆర్వో ట్విట్టర్(Twitter)లో చెప్పిన టైంకి రీలిజ్ చేస్తామని స్పష్టం చేశారు. పైగా ఇప్పుడు చివరి షెడ్యూల్ కూడా స్టార్ట్ కావడంతో నమ్మకం ఏర్పడింది. దీంతో మొదటి పార్ట్ షూటింగ్ అంతా కూడా ఫినిష్ కానుంది. తాజాగా హరి హర వీరమల్లు చివరి షెడ్యూల్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మరి ఈ షెడ్యూల్‌లో పాల్గొంటాడా? ఎన్ని రోజులు డేట్లు కేటాయించాడు అన్నది మాత్రం స్పష్టత రాలేదు.






