‘హరిహర వీరమల్లు’ చిత్ర యూనిట్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

హరిహర వీరమల్లు చిత్రం(Harihara Veeramallu Movie) విడుదలపై సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దని చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది.

‘హరిహర వీరమల్లు’ చిత్ర యూనిట్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: హరిహర వీరమల్లు చిత్రం(Harihara Veeramallu Movie) విడుదలపై సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దని చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. జూన్ 20 అని ఒకరు, జూన్ 26 అని మరొకరు, జులై 4వ తేదీన అంటూ ఇలా రోజుకో రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని.. ఈ వార్తలను అభిమానులు నమ్మొద్దని సూచనలు చేసింది. అతి త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ ఇస్తామని పేర్కొంది. పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా రూపొందుతోన్న ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌‌కు క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

భారీ చిత్రాల నిర్మాత ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటించగా.. విలన్‌గా బాలీవుడ్ నటుడు బాబి డియోల్ నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాల్లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. జూన్‌ 12న దీనిని విడుదల చేయాలని భావించినప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేసింది. దీంతో మూవీ విడుదలపై వదంతులు వస్తుండటంతో చిత్రబృందం అప్రమత్తమై.. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని చెప్పింది.

Next Story