- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓవర్సీస్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన హరి హర వీరమల్లు
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Harihara Veeramallu) ఎన్నో ఎదురుచూపుల తర్వాత జులై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Harihara Veeramallu) ఎన్నో ఎదురుచూపుల తర్వాత జులై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా విడుదల విషయంలో ఇటీవల చిన్న గందరగోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ డిజిటల్ ప్రింట్ ఇంకా రాలేదని సోషల్ మీడియాలో వెల్లడించింది. దీంతో ప్రేక్షకుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఆ సంస్థ దీనిపై అప్ డేట్ ఇచ్చింది. డిజిటల్ ప్రింట్ వచ్చిందని స్పష్టత ఇచ్చింది. దీంతో ఓవర్సీస్‌లో సినిమా విడుదలకు లైన్ క్లియర్ కావటంతో ప్రేక్షకుల్లో సందడి నెలకొన్నాయి. అలాగే, సినిమా నిడివిపై కూడా క్లారిటీ వచ్చింది. ఫస్ట్ హాఫ్ నిడివి 1 గంట 26 నిమిషాలు 40 సెకన్లు, సెకండ్ హాఫ్ 1 గంట 18 నిమిషాలుగా ఉంటుందని వెల్లడించింది.
ఇక ఈ సినిమాను ఏఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. పవన్ ఇందులో చారిత్రక యోధుడిగా మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, తొలిభాగం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది.






