'ఆంధ్ర కింగ్ తాలూకా' ఆల్బమ్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం సంతోషం: వివేక్ & మెర్విన్

by Chukka Sudharani |

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది.

ఆంధ్ర కింగ్ తాలూకా ఆల్బమ్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం సంతోషం: వివేక్ & మెర్విన్
X

దిశ, సినిమా: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూస్ ఇస్తూ సినిమా విశేషాలు పంచుకుంటున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. నాలుగు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారిన విషయం తెలిసిందే. దీంతో రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వివేక్ & మెర్విన్ సినిమా విశేషాలు పంచుకున్నారు.

‘మా ఇద్దరిదీ చెన్నై. మేము తమిళ్లో 20 సినిమాలు చేశాం. ఆంధ్రా కింగ్ తాలూకా తెలుగులో మా మొదటి సినిమా. 2024లో రామ్ మాకు కాల్ చేశారు. చాలా మంచి మ్యూజిక్ చేస్తున్నారని ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. ఒక నెల రోజులు తర్వాత ఈ ప్రాజెక్టు గురించి చెప్పారు. అలా సినిమాల్లోకి వచ్చాం. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు నాలుగు పాటలు రిలీజ్ అయ్యాయి. ఇంకా మూడు పాటలు ఉన్నాయి. కథలో చాలా కీలకమైన పాటలు అవి. అందుకే ఇప్పుడే రిలీజ్ చేయలేదు.. సినిమా రిలీజ్ తర్వాత విడుదల చేస్తాం. ఇందులో ప్రతి పాట విజువల్‌గా స్టన్నింగ్‌గా ఉంటుంది. ఇందులో ప్రతిదీ మాకు ఫేవరెట్ సాంగ్. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి పాటకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఆడియన్స్ ఒక రిట్రో సౌండ్‌ని ఫీలవుతారు.

ఈ సినిమా మొత్తం మేము రామ్ అండ్ డైరెక్టర్ మహేష్‌తో చాలా క్లోజ్‌గా ఉన్నాం. ప్రతీ క్షణం మాతోనే ఉండేవాళ్లు. బేసిక్‌గా అయితే ఒక ట్యూన్‌ని కంపోజ్ చేసి ప్రొడ్యూసర్‌కి సెండ్ చేస్తాము ఈ సినిమాకి మాత్రం అందరం ఒక రూమ్‌లో కూర్చుని కంపోజ్ చేయడం జరిగింది. ఇది చాలా యూనిక్ స్టోరీ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో కూడా మేము చాలా కొత్త సౌండ్‌ని ప్రయత్నించాము. సినిమా చూస్తున్నప్పుడు మీకు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఈ సినిమా కోసం దాదాపుగా 30 థీమ్స్‌ని క్రియేట్ చేశాము. కచ్చితంగా అందరూ దీనికి కనెక్ట్ అవుతారు’ అంటూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు వివేక్ & మెర్విన్. కాగా.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు.

Next Story