- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
re-release: ఆ సినిమా రీరిలీజ్.. రిలీజ్ టైమ్‌లోనే చూడలేదు ఇప్పుడెవరు చూస్తారంటున్న నెటిజన్లు
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ నటుస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ నటుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్స్ బర్త్‌డేలు, పండుగల సందర్భంగా గతంలో విడుదలైన చిత్రాలను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో చిత్రం రీరిలీజ్‌కు సిద్ధం అయింది. అర్జున్, జగపతి బాబు, తొట్టెంపూడి వేణు, లయ, స్నేహ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘హనుమాన్ జంక్షన్’. ఎం.రాజా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2001లో విడుదలైంది.
ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య.. ప్రేమ కారణంగా ఏర్పడిన మనస్పర్థలు చివరికి ఏ పరిస్థికి దారితీస్తాయి.. ఫైనల్‌గా మళ్లీ ఎలా కలుస్తారు అనేది స్టోరీ. అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన కామెడీ పరంగా పర్వాలేదు అనిపించుకుంది. అలాంటి ఈ మూవీ ఇప్పుడు రీ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. జూన్ 28న ఈ చిత్రం రీరిలీజ్ కాబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర బృందం.. ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతుండగా.. రిలీజ్ టైమ్‌లోనే చూడలేదు.. రీరిలీజ్ అవసరమా అని కొందరు అంటుంటే.. ఇలాంటి చిత్రాలు రీరిలీజ్‌లో మంచి హిట్ అవుతాయని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






