- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hanu Raghavapudi: ప్రభాస్‌తో సినిమా… ఆ హీరోపై ప్రశంసలు
హను రాఘవపూడి మాట్లాడుతూ.. తారక్‌తో సినిమా చేయాలని తనకు ఎంతో ఆసక్తి ఉందని, సరైన కథ దొరకకపోవడం వల్ల ఇప్పటివరకు చేయలేకపోయానని ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో హను రాఘవపూడి ఒకరు. ఈయన అందాల రాక్షసి చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించాడు. మొదటి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో కృష్ణగాడి వీర ప్రేమ గాథ, సీత రామం వంటి సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రభాస్ హీరోగా ఫౌజీ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్‌లో జరుగుతోంది.
ప్రభాస్‌తో సినిమా చేస్తున్న సమయంలో ఈయన టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈయన మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ ఒక సునామీ లాంటి నటుడు. ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాను. కానీ అందుకు తగ్గ స్టోరీ దొరకకపోవడం వల్ల ఇప్పటివరకు కుదరలేదు. అప్పుడప్పుడు ఆయనను కలుస్తూ ఉంటాను. ‘సీత రామం’ విడుదలై మంచి విజయం సాధించిన తర్వాత ఆయన అభిమానులు కూడా తనతో సినిమా చేయాలని డిమాండ్ చేశారు. నేను కూడా చేయాలి అనుకున్నాను. దాంతో కొంతమంది ‘ఆయన చెబుతాడు కానీ సినిమా చేయడు’ అని ఫన్నీగా రియాక్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు.






