- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్తతో విడాకులపై హన్సిక హాట్ కామెంట్స్
అల్లు అర్జున్ ‘దేశముదురు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హన్సిక.. అనతికాలంలోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, సినిమా: అల్లు అర్జున్ ‘దేశముదురు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హన్సిక.. అనతికాలంలోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా పలు సినిమాలు, షోస్ చేస్తూ బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇక ఇటీవల ఈ బ్యూటీ తన భర్త సొహెల్ కతురియాతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచింది. అయితే.. తాజా ఇంటర్వ్యూలో తన విడాకులపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘విడాకుల విషయంపై నేను ఎప్పుడూ స్పష్టత ఇవ్వలేదు. ఇవ్వాలని కూడా అనుకోవడం లేదు. డివోర్స్ అనేవి పూర్తిగా మా వ్యక్తిగతం. వాటికి సంబంధించిన కారణాలు మా మధ్యే ఉండాలి. అయితే.. విడాకులు తీసుకోవడంపై నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. మనం తప్పు ట్రైన్ ఎక్కామని తెలిసినప్పుడు అది దిగిపోవడమే మంచిది. ప్రస్తుతం నేను మానసికంగా బాగానే ఉన్నాను. నా వ్యక్తిగత జీవితంపై ప్రజల అభిప్రాయాల కంటే నాకు నా ఆరోగ్యం, శేయస్సు చాలా ముఖ్యం. ప్రజలకు కావాల్సింది హెడ్ లైన్స్, క్లిక్ బైట్స్ అవి వచ్చాయి. నా కష్టసమయంలో నా ఫ్యామిలీ నాకు ఎంతో అండగా నిలిచింది. విడాకుల తర్వాత కొంచెం ఫ్రెస్ అవ్వడానికి జపాన్ వెళ్లొచ్చాను’ అని చెప్పుకొచ్చింది హన్సిక.






