- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్టు మెట్లెక్కిన హీరోయిన్ హన్సిక!
టాలీవుడ్ హీరోయిన్ హన్సిక ( Actor Hansika Motwani ) గురించి తెలియని వారు ఉండరు. అప్పట్లో దేశముదురు ( Desha Muduru)

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ హన్సిక ( Actor Hansika Motwani ) గురించి తెలియని వారు ఉండరు. అప్పట్లో దేశముదురు ( Desha Muduru) సినిమాతో... టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది హన్సిక. అల్లు అర్జున్ ( Allu arjun) హీరోగా చేసిన దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ హన్సిక (Actor Hansika Motwani )... ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలతో.. సినిమాలు చేసి సక్సెస్ అయింది. అదే కొన్ని అనివార్య కారణాలవల్ల... టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ... బాలీవుడ్ లో అడపాదడప సినిమాలు చేస్తోంది.
అయితే తాజాగా ఈ హీరోయిన్ హన్సిక కోర్టు మెట్లు ఎక్కింది. తన కుటుంబంలో గొడవ కారణంగా కోర్టు వరకు వెళ్ళింది హీరోయిన్ హన్సిక. తనపై గృహహింస కేసు కొట్టివేయాలని... కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. తనతోపాటు తన తల్లి పైన నమోదైన గృహహింస కేసును కొట్టివేయాలని బాంబే కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది హీరోయిన్ హన్సిక. ఈ తరుణంలో ఈ కేసును విచారించిన న్యాయస్థానం... కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతివాదులు ఇద్దరికీ న్యాయస్థానం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. అలాగే ఈ కేసు విచారణను వాయిదా వేసింది కోర్టు.
ఇది ఇలా ఉండగా... అత్తగారింట్లో తనను వేధిస్తున్నారని హన్సిక సోదరుడు ప్రశాంత్ భార్య ముస్కాన్... అప్పట్లో కేసు పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. తనకు 20 లక్షలు అలాగే ఖరీదైన బహుమతులు ఇవ్వాలని... హీరోయిన్ హన్సిక కూడా తనను టార్చర్ పెట్టినట్లు కేసు పెట్టింది ముస్కాన్. ఇలా హీరోయిన్ హన్సిక కుటుంబం మొత్తం ఈ కేసులో ఇరుక్కుంది. అయితే ఈ కేసు నుంచి తన పేరు అలాగే తన తల్లి పేరును కొట్టివేయాలని పిటిషన్ వేసింది హన్సిక.






