'దేశముదురు' సమయంలో వచ్చిన గ్రోత్ హార్మోన్ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన హన్సిక

by Pulgam srinivas |

దేశముదురు సినిమా సమయంలో హన్సికపై గ్రోత్ హార్మోన్‌కు సంబంధించిన పలు రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వీటిని హన్సిక తీవ్రంగా ఖండించింది.

దేశముదురు సమయంలో వచ్చిన గ్రోత్ హార్మోన్ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన హన్సిక
X

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ హన్సిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిందీ సినిమాల ద్వారా సినిమా పరిశ్రమలోకి తెరంగేట్రం చేసిన ఈ నటి, దేశముదురు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించగా, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడం, ఇందులో ఈమె తన నటనతో, అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ ద్వారా ఈ హీరోయిన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. దాని తర్వాత ఈమెకు తెలుగులో అనేక చిత్రాల్లో అవకాశాలు దక్కాయి. చాలా కాలం పాటు ఈమె తెలుగు తెరపై తిరుగులేని నటిగా కొనసాగింది. ఆ తర్వాత ఈ బ్యూటీ తమిళంలో కూడా స్టార్ హీరోయిన్‌గా అనేక సంవత్సరాలు కెరీర్‌ను ముందుకు సాగించింది.

ఇకపోతే దేశముదురు సినిమా సమయంలో హన్సికపై గ్రోత్ హార్మోన్‌కు సంబంధించిన పలు రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈ వార్తలు ఇండస్ట్రీలోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా పెద్ద చర్చకు దారితీశాయి. ఎట్టకేలకు ఇటీవల ఈ విషయంపై స్పందించిన హన్సిక, ఆ రూమర్లన్నింటినీ పూర్తిగా ఖండించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… “అది అంతా అర్థంలేని ప్రచారం. మీడియా వాళ్లు క్లిక్‌బైట్ కోసం ఏదైనా సృష్టించగలరు” అని తెలిపింది. ఇక తనకు ఇప్పటికీ ఇంజెక్షన్ అంటే చాలా భయం అని, అలాగే “నాకు ఇప్పటికీ ఇంజెక్షన్ వేస్తే, ఆ మందు పూర్తిగా అయిపోయే వరకు ఏడుస్తూనే ఉంటాను” అని ఆమె చెప్పుకొచ్చింది. ఇలా హన్సిక అప్పటి రూమర్లకు ఇప్పుడు పుల్‌స్టాప్ పెట్టేసింది.

Next Story