- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'.. ఎప్పుడు.. ఎక్కడో.. తెలుసా?
by Pulgam srinivas |
'హై జవానీ తో ఇష్క్ హోనా హై' చిత్రం జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

X
దిశ, వెబ్ డెస్క్: వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'. ఈ చిత్రం జూన్ 5, 2026న భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను 'జీ5' సంస్థ సొంతం చేసుకోగా, జూలై 31 నుంచి హిందీ భాషలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన ఈ చిత్రం, ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టిప్స్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రమేష్ తౌరానీ నిర్మించారు. మనీష్ పాల్, చంకీ పాండే, జిమ్మీ షెర్గిల్, మౌనీ రాయ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
Next Story






