- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యతో హెచ్. వినోత్ సినిమా ఫిక్స్..?
జాగారం స్టూడియోస్ బ్యానర్‌పై సూర్య- హెచ్. వినోత్ కాంబోలో మూవీ ఫిక్స్.

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, సూర్య తదుపరి చిత్రానికి తమిళ మాస్ దర్శకుల్లో ఒకరైన హెచ్. వినోత్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మాస్ డైరెక్టర్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇక సూర్య ప్రస్తుతం తన 47వ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ మూవీ షూటింగ్‌ను మరో రెండు నెలల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే సూర్య–వినోత్ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం సూర్య కెరీర్‌లో 48వ మూవీగా రూపొందే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రాన్ని జాగారం స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దర్శకుడు హెచ్. వినోత్ ఇటీవల తలపతి విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ ఏడాది పొంగల్ కానుకగా విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల ఇప్పటివరకు విడుదల కాలేదు.






