Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ సినిమాలో GV ప్రకాష్.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్

by Chukka Sudharani |

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుష్ చేస్తున్నాడు.

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ సినిమాలో GV ప్రకాష్.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుష్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తు్న్న చిత్రాల్లో ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamolo Oka Taara) ఒకటి. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగు సినిమాగా రాబోతుండగా.. దీనిని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. ఈ మూవీ అనౌన్స్ చేసి చాలా కాలం అవుతున్నప్పటికీ ఇందులో నుంచి.. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తప్ప మరో అప్డేట్ రాలేదు.

ఈ క్రమంలోనే తాజాగా ‘ఆకాశంలో ఒక తారా’ బోర్డులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాష్ (GV Prakash) జాయిన్ అయినట్లు తెలిపారు. ఈ రోజు GV ప్రకాష్ పుట్టిన రోజు కావడంతో.. ఈ సినిమాకు ఆయన సంగీతం అందిస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘స్టార్స్‌కి ఆకాశాన్ని తాకే సౌండ్‌ట్రాక్ ప్రయాణం అవసరం.. మ్యూజికల్ స్టార్ GV ప్రకాష్ బర్త్‌డే సందర్భంగా.. ఆయనను ‘ఆకాశంలో ఒక తార’ బోర్డ్‌లోకి బృందం హృదయపూర్వకంగా స్వాగతిస్తుంది’ అని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు.

Next Story