డార్క్ కామెడీ థ్రిల్లర్ ‘గుర్రం పాపిరెడ్డి’.. రిలీజ్ డేట్ ఫిక్స్

by Sujitha Rachapalli |

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తుండగా.. మురళీ మనోహర్ దర్శకులు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో ఈ చిత్రం

డార్క్ కామెడీ థ్రిల్లర్ ‘గుర్రం పాపిరెడ్డి’.. రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తుండగా.. మురళీ మనోహర్ దర్శకులు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతుందని తెలిపారు మేకర్స్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా ‘పైసా డుమ్ డుమ్’ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. కంటెంట్ బాగుంటే మన తెలుగు ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నామని, డార్క్ కామెడీ జానర్‌లోనే కొత్తగా ప్రయత్నించామని చెప్పిన మేకర్స్.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టామన్నారు. ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా క్వాలిటీగా వచ్చేందుకు ప్రతి టీమ్ మెంబర్ వర్క్ చేశారని.. సినిమా నిరాశపరదని తెలిపారు. డిసెంబర్ అంటే హాలీడేస్ సీజన్. ఇలాంటి సీజన్‌లో ఫుల్ ఫన్ ఉండే తమ మూవీ చూడటం మరింత ఎంటర్‌టైన్ చేస్తుందన్నారు. మల్టిపుల్ క్యారెక్టర్స్, లేయర్స్‌తో ప్రేక్షకుల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని.. ట్రైలర్‌ను ఈ నెల 11న లేదా 12న రిలీజ్ చేయాలనుకుంటున్నామని తెలిపారు.

Next Story