శ్రీశైలం అడవుల్లో పాతి పెట్టిన శవం దొంగతనం

by Sujitha Rachapalli |

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు.

శ్రీశైలం అడవుల్లో పాతి పెట్టిన శవం దొంగతనం
X

దిశ, సినిమా : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ సిద్ధం కాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే... జడ్జి జి.వైద్యనాథన్ (బ్రహ్మానందం) తెలివి తక్కువ వాళ్లతో వ్యవహరించడంలో అనుభవజ్ఞుడు. అలాంటి ఆయన దగ్గరకు ఓ విచిత్రమైన కేసు హియరింగ్‌కు వస్తుంది. నలుగురు ఫ్రెండ్స్ గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య), సౌధామిని (ఫరియా అబ్దుల్లా), మిలటరీ (రాజ్ కుమార్ కాసిరెడ్డి), చిలిపి (వంశీధర్ కోస్గి) కలిసి శ్రీశైలం అడవుల్లో సమాధి చేసిన ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్తారు. అక్కడికి మరికొందరు గ్రేవ్ రాబర్స్ కూడా పోటీకి వస్తారు. ఆ దొంగలతో ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్రీశైలం అడవుల్లో పాతిపెట్టిన ఆ శవం ఎవరిది? దాని కోసం హీరో గ్యాంగ్‌తో పాటు మరికొన్ని గ్యాంగ్స్ ఎందుకు వేట సాగిస్తున్నాయి? ఈ వేట కథను ఉడ్రాజు (యోగి బాబు) ఎలా మలుపుతిప్పాడు? 1927 నుంచి 1987 వరకు జీవించిన కలింగ పోతురాజు ఎవరు? శ్రీ మార్కండేయ రాజుతో ఈ కథకున్న లింకు ఏంటి? అనే ఆసక్తికర అంశాలతో ట్రైలర్ ఆకట్టుకుంది. బ్రహ్మానందం, యోగి బాబు, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్, జీవన్ కుమార్, ప్రభాస్ శ్రీను వంటి మంచి పేరున్న ఆర్టిస్టులతో ట్రైలర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది.

Next Story