- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఖండ 2 టికెట్ రూ.5 లక్షలు పెట్టి కొన్న ఎమ్మెల్యే
అఖండ 2 సినిమా టికెట్ ను చిత్తూరు కూటమి శాసన సభ్యులు గురజాల జగన్ మోహన్ ఏకంగా ఐదు లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5 అంటే రేపు రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు ఇవాళ సాయంత్రం పడాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రీమియర్లు రద్దు అయ్యాయి. ఇక రేపే సినిమా రిలీజ్ కానుంది. ఈ మేరకు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించింది. అయితే ఇలాంటి నేపథ్యంలో అఖండ 2 సినిమా టికెట్ ను చిత్తూరు కూటమి శాసన సభ్యులు గురజాల జగన్ మోహన్ ఏకంగా ఐదు లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు.
నందమూరి బాలయ్యపై తనకు ఉన్న అభిమానాన్ని టికెట్ కొనుగోలు చేసి చాటుకున్నారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య అభిమానుల సంఘం నాయకులందరూ కలిసి, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ను కలిసి టికెట్ అందించారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 సినిమా బంపర్ హిట్ అవుతుందని, ఓ అభిమానిగా సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా అఖండ 2 సినిమాలో నందమూరి బాలయ్య హీరోగా చేయగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా మెరిశారు.






