Gunasekhar: ‘హిరణ్యకశ్యప’పై త్రివిక్రమ్‌కు ఫోన్ చేశా.. ఆయన ఇచ్చిన సమాధానం ఇదే

by Pulgam srinivas |

‘హిరణ్యకశ్యప’ సినిమాలో త్రివిక్రమ్ కేవలం రచన పరంగా మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారని, దర్శకత్వ బాధ్యతలతో తనకు సంబంధం లేదని గుణశేఖర్ వెల్లడించారు.

Gunasekhar: ‘హిరణ్యకశ్యప’పై త్రివిక్రమ్‌కు ఫోన్ చేశా.. ఆయన ఇచ్చిన సమాధానం ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన దర్శకుల్లో గుణశేఖర్, త్రివిక్రమ్ ప్రముఖులు. వీరిద్దరూ ‘హిరణ్యకశ్యప’ సినిమాను రూపొందించబోతున్నారనే వార్తలు గతంలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై దర్శకుడు గుణశేఖర్ పూర్తి స్పష్టత ఇచ్చారు. గుణశేఖర్ మాట్లాడుతూ.. హిరణ్యకశ్యప సినిమా విషయంలో త్రివిక్రమ్ గారు ఇన్వాల్వ్ అవుతున్నారని చాలా మంది చెబుతున్నారు. ఈ విషయం నా దృష్టికి కూడా వచ్చింది.

దీంతో ఒకరోజు నేను త్రివిక్రమ్ గారికి ఫోన్ చేసి, మీరు ‘హిరణ్యకశ్యప’ సినిమా చేస్తున్నారా? అని నేరుగా అడిగాను. దానికి ఆయన.. ‘నేను ఈ ప్రాజెక్ట్‌లో రచన పరంగా మాత్రమే ఇన్వాల్వ్ అయ్యాను. దర్శకత్వ బాధ్యతలతో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని సమాధానం ఇచ్చారు” అని తెలిపారు. అలాగే ‘హిరణ్యకశ్యప’ సినిమాను నిర్మించేందుకు మొదట ఫాక్స్ స్టూడియోస్, డిస్నీ వంటి ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయని, అయితే ఈ చిత్రానికి సుమారు రూ.300 కోట్ల బడ్జెట్ అవసరమని తెలిసిన తర్వాత వారు వెనక్కు తగ్గారని గుణశేఖర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story