Kantara: Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’ నుంచి మరో అప్డేట్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్

by Chukka Sudharani |

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ డైరెక్షన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కాంతార: చాప్టర్ 1’

Kantara: Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’ నుంచి మరో అప్డేట్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ డైరెక్షన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1). 2022లో చిన్న సినిమాగా వచ్చి కన్నడతో పాటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. హోంబలే ఫిలింస్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. మూవీలో నటిస్తున్న పాత్రలకు సంబంధించిన వరుస పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి పోస్టర్ ఎంతగానో ఆకట్టుకోగా.. తాజాగా మరో పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో నటుడు గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah) ‘కులశేఖర’ పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తలపై కిరీటంతోరాజసం ఉట్టి పడుతున్న ఈ గుల్షన్ దేవయ్య లుక్ సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అవుతోంది. Link


Next Story