- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలకృష్ణ–వివేక్ ఆత్రేయ కాంబోకు గ్రీన్ సిగ్నల్?
NBK 112: బాలయ్య చిత్రానికి రూట్ క్లియర్.. దసరా తర్వాత నుండి రెగ్యులర్ షూట్ స్టార్ట్.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ప్రస్తుతానికి ‘NBK 111’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాను దసరా సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. ఈ సినిమా అనంతరం బాలకృష్ణ, టాలీవుడ్ యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది.
ఇటీవల వివేక్ ఆత్రేయ చెప్పిన కథ బాలకృష్ణకు నచ్చడంతో వెంటనే కొత్త ప్రాజెక్ట్‌కు అంగీకారం తెలిపినట్లు సమాచారం. దాంతో దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇప్పటికే ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రీ-ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసినట్లు తెలిసింది. ‘NBK 111’ చిత్ర విడుదలైన తర్వాత ఈ కొత్త ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2027 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు తెలుస్తుంది.






