గొప్పతనం అనేది స్టెప్స్‌లో కాదు.. గ్రేస్‌లో ఉంటుంది: టాలీవుడ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Gugulothu.Kavitha |

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Jiddu Jonnalagadda) నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ‘తెలుసు కదా’(Telusu Kadha).

గొప్పతనం అనేది స్టెప్స్‌లో కాదు.. గ్రేస్‌లో ఉంటుంది: టాలీవుడ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Jiddu Jonnalagadda) నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ‘తెలుసు కదా’(Telusu Kadha). నీరజ కోన(Neeraja Kona) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో రాశి ఖన్నా(Rashi Khanna), శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తుండగా.. వైవా హర్ష(Viva Harsha) కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 17న తెలుగు, తమిళం, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది.

అయితే ఈ మూవీ నుంచి ‘మల్లిక గంధ’(Mallika Gandha) అనే సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రొమాన్స్, మెలోడీ, భావోద్వేగాల సమ్మేళనంగా ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఈ క్రమంలో తాజాగా రాశి ఖన్న తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టింది. ఈ సాంగ్‌ వీడియోను షేర్ చేస్తూ.. ‘గొప్పతనం అనేది స్టెప్స్‌లో కాదు.. గ్రేస్‌లో ఉంటుంది’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.


Next Story