బండ్ల గణేష్ ఇంట్లో గ్రాండ్‌ దీపావళి పార్టీ.. టాలీవుడ్ అగ్రహీరోలు హాజరు!

by Gantepaka Srikanth |

దీపావళి పండుగ(Diwali Festival) అందరికీ ప్రత్యేకమే.. దానిని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్(Bandla Ganesh) మరింత స్పెషల్‌గా మార్చుకున్నారు.

బండ్ల గణేష్ ఇంట్లో గ్రాండ్‌ దీపావళి పార్టీ.. టాలీవుడ్ అగ్రహీరోలు హాజరు!
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి పండుగ(Diwali Festival) అందరికీ ప్రత్యేకమే.. దానిని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్(Bandla Ganesh) మరింత స్పెషల్‌గా మార్చుకున్నారు. ఈ దీపావళిని అత్యంత గ్రాండ్‌గా నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ సహా పలువురు హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, యాక్టర్లు పాల్గొన్నట్లు సమాచారం. ఒకప్పుడు నిర్మాతగా బిజీగా ఉన్న బండ్ల.. గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటున్నాడు. అప్పుడప్పుడు మీడియా ముందకు రావడం తప్ప.. అంతగా కనిపించడం లేదు. అందుతున్న సమాచారం ప్రకారం మరోసారి బండ్ల నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీపావళి తర్వాత సినిమా అప్డేట్స్ ఇస్తారని సమాచారం. వీడియో

Next Story