- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’కు సర్కార్ గుడ్ న్యూస్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రబృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రబృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈనెల 24వ తేదీన సినిమా విడుదల ఉండటంతో మొదటి పది రోజులు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పవన్ కల్యాణ్ పోరాట యోధుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ బాబి డియోల్ ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నారు. సునీల్, నాజర్, రావు రమేశ్, అనుదీప్ కేవీ, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ సహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. పవన్ కల్యాణ్ కెరియర్‌లో వస్తోన్న తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తొలి భాగం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది.






