- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో రెండు సినిమాల టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సంక్రాంతి సినిమాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ లు వినిపిస్తోంది. టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ చిత్రపరిశ్రమను ప్రోత్సహిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి సినిమాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ లు వినిపిస్తోంది. టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ చిత్రపరిశ్రమను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన రాజాసాబ్, విడుదలకు సిద్ధంగా ఉన్న మన శంకర వర ప్రసాద్ సినిమాలకు ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వగా తాజాగా మరో రెండు సినిమాలకు సైతం ఇచ్చింది. రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు సినిమాలు పది రోజుల వరకు మల్టీప్లెక్స్ లో రూ.75, సింగిల్ స్క్రీన్ లో రూ.50 పెంచుకోవచ్చని ఉత్వర్వులు జారీ చేసింది. వీటిలో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా జనవరి 13న విడుదల కానుండగా, అనగనగా ఒక రాజు సినిమా జగనవరి 14న విడుదల కానుంది. ఇక ఇప్పటికే విడుదలైన రాజాసాబ్ కు నెగిటివ్ టాక్ వస్తోంది. మనశంకర వరప్రసాద్ గారు సినిమా జనవరి 12న విడుదల కానుంది. మరి ఈ నాలుగు సినిమాల్లో సంక్రాంతి విన్నర్ గా ఏది నిలుస్తుందో చూడాలి.






