‘OG’ టికెట్ రేట్లు పెంచేందుకు సర్కార్ అనుమతి.. ఒక్క టికెట్‌పై ఎంత పెరిగిందంటే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-17 14:39:22  IST  )

ఆంధప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ మూవీ ఈ నెల 25న విడుదల కాబోతోంది.

‘OG’ టికెట్ రేట్లు పెంచేందుకు సర్కార్ అనుమతి.. ఒక్క టికెట్‌పై ఎంత పెరిగిందంటే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ మూవీ ఈ నెల 25న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి పవర్ స్టార్ కల్ట్ ఫ్యాన్ సుజిత్ దర్శకత్వం వహించగా.. డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ ఓజీ టికెట్ల రేట్లను పెంచేందుకు అనుమతించింది. 25న తెల్లవారుజామున ఒంటి గంటకు ప్రదర్శించే బెనిఫిట్ షోకు టికెట్ ప్రైజ్ రూ.వెయ్యిగా నిర్ణయించారు. అదేవిధంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్క టికెట్‌పై రూ.125, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంచేందుకు సర్కార్ పర్మీషన్ ఇచ్చింది. ఇక తెలంగాణలో ‘ఓజీ’ మూవీ టికెట్ రేట్లపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Next Story