- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gopichand: గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్..
గతేడాది ‘భీమా’, ‘విశ్వం’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ (Gopichand).. ప్రస్తుతం తన 33వ సినిమాతో బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: గతేడాది ‘భీమా’, ‘విశ్వం’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ (Gopichand).. ప్రస్తుతం తన 33వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘ఘాజీ’, ‘అంతరిక్షం 9000 KMPH’ ఫేమ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఒక చారిత్రక ఇతివృత్తం ఆధారంగా రూపొందుతోందని తెలుస్తుండగా.. ఇందులో గోపీచంద్ ఇంతకు ముందెన్నడూ కనిపించని పాత్రలో కనిపించనున్నాడట. తాజాగా ఈ మూవీ టైటిల్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రానికి ‘శూల’ (Shula) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట మేకర్స్. ‘శూల’ అనేది ఓ ప్రదేశం పేరు కాగా.. కథలో ఈ ప్రదేశానికి చాలా ప్రాముఖ్యం ఉందని ఫిలిమ్ వర్గాల నుంచి టాక్. త్వరలో ఈ టైటిల్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. కాగా.. ‘Gopichand33’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కునున్న ఈ మూవీకి సంబంధించి ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ మూవీకి శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఇందులో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుంది.






