- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
70ఎంఎం బ్యానర్‌లో గోపీచంద్ కొత్త చిత్రం.. దర్శకుడు ఎవరో తెలుసా?
by Pulgam srinivas |
మ్యాచో స్టార్ గోపీచంద్ తదుపరి చిత్రం 70 ఎంఎం బ్యానర్‌పై రూపొందనుండగా, దీనికి వెంకట్ మాస్టర్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.

X
దిశ, వెబ్ డెస్క్: మ్యాచో స్టార్ గోపీచంద్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న వివరాల ప్రకారం, ఆయన తదుపరి చిత్రం 70 ఎంఎం బ్యానర్‌పై రూపొందనుండగా, దీనికి వెంకట్ మాస్టర్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభ కార్యక్రమాలను మే 3వ తేదీన నిర్వహించేందుకు మూవీ యూనిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాల అనంతరం చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం గోపీచంద్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భరత వర్ష: సాగా ఆఫ్ శూల’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా కనిపించనుండగా, సంగీతాన్ని అనుదీప్ దేవ్ అందిస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
Next Story






