- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలయ్య ప్లాన్‌తో గోపీచంద్ మలినేని చిత్రానికి బ్రేకులు
బాలయ్య ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు. అయితే ఈ సినిమా కంటే ముందే విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందనున్న సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే బాలయ్య, విజయ్ కనకమేడల దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో చాలామంది గోపీచంద్‌తో సినిమా పూర్తి అయిన తర్వాత విజయ్ దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తాడని అనుకున్నారు. కానీ ఈ విషయంలో సడన్ ట్విస్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. గోపీచంద్ చిత్రం కంటే ముందే విజయ్ సినిమాను కంప్లీట్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ కనకమేడల, బాలయ్య సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.
మరికొన్ని రోజుల్లో ఈ పనులను పూర్తి చేసి, జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో ఏకకాలంలో బాలయ్య ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇక విజయ్ సినిమా పూర్తయ్యేసరికి, గోపీచంద్ సినిమాకు సంబంధించిన రెండు లేదా మూడు షెడ్యూల్స్ మాత్రమే పూర్తి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో బాలయ్య, గోపీచంద్‌తో ముందుగా సినిమా ప్రారంభించినప్పటికీ, విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ముందుగా విడుదల కానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.






