వరలక్ష్మీ శరత్ కుమార్ వెంటపడుతున్న తెలుగు డైరెక్టర్.. దాని కోసమేనా?

by Disha Web Desk 6 |
వరలక్ష్మీ శరత్ కుమార్ వెంటపడుతున్న తెలుగు డైరెక్టర్.. దాని కోసమేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: నటి వరలక్ష్మి శరత్ కుమార్‌కు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ లేడీ విలన్‌గానే ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే సౌత్‌లో భారీ డిమాండ్ సంపాదించకున్న వరలక్ష్మి ఓ తెలుగు డైరెక్టర్ మోస్ట్ వాంటెడ్ నటిగా మారినట్లు తెలుస్తోంది. ఆమె లేనిదే ఏ సినిమా తీయడం లేదని టాక్.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్, ‘వీర సింహారెడ్డి సినిమాల్లో వరలక్ష్మి కీలక పాత్ర పోషించింది. ఇవి రెండు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ సారి కూడా హిట్ కొట్టాలని రవితేజ కొత్త సినిమాలో గోపీచంద్ మలినేని తన లక్కీ ఛార్మ్ అయిన వరలక్ష్మికి ప్రత్యేక పాత్రను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు కానీ.. వరలక్ష్మిని మాత్రం ఓ ముఖ్యమైన రోల్ కోసం గోపీచంద్ లైన్ లో పెట్టాడట. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు వరలక్ష్మిపై ఆ డైరెక్టర్‌కు అంత ఇంట్రెస్ట్ ఎందుకో? అని చర్చించుకుంటున్నారు.

Read More: చిరు ఫ్యాన్స్‌కు పండుగే.. భోళాశంకర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Next Story