Adhik Balayya: గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్‌తో బాలయ్య మూవీ?

by Naga Rani Yarlagadda |

తాజాగా ఈ డైరెక్టర్.. టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)తో కలిసి భారీ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అధిక్ రవిచంద్రన్ బాలకృష్ణను కలిసి ఒక స్టోరీ లైన్ కూడా చెప్పారని, అది విన్న బాలకృష్ణ ఫిదా అయ్యారని అటు తమిళ్ మీడియాలో, ఇటు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Adhik Balayya: గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్‌తో బాలయ్య మూవీ?
X

దిశ, వెబ్‌డెస్క్: అజిత్ హీరోగా, త్రిష, ప్రియ ప్రకాష్ వారియర్, షిన్ టామ్ చాకో, అర్జున్ దాస్ వంటి నటీనటులతో గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly) సినిమాను తెరకెక్కించి.. బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు తమిళ దర్శడుకు అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran). తాజాగా ఈ డైరెక్టర్.. టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)తో కలిసి భారీ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అధిక్ రవిచంద్రన్ బాలకృష్ణను కలిసి ఒక స్టోరీ లైన్ కూడా చెప్పారని, అది విన్న బాలకృష్ణ ఫిదా అయ్యారని అటు తమిళ్ మీడియాలో, ఇటు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మార్క్ ఆంటోని (Mark Antony) వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన అధిక్.. గుడ్ బ్యాడ్ అగ్లీతో ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తోన్న అజిత్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అలాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాలయ్యతో సినిమా తీస్తే.. మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అధిక్ తన నెక్స్ట్ సినిమా కూడా అజిత్ తోనే చేస్తారని తమిళ ఇండస్ట్రీ అంటోంది. ఈ సందిగ్ధంపై క్లారిటీ రావాలంటే అధిక్ నోరు విప్పాల్సిందే.

Next Story