- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Renu Desai: దయచేసి సహాయం చేయండి.. చేతులెత్తి దండం పెడుతూ రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ నటి రేణు దేశాయ్(Renu Desai) గతంలో హీరోయిన్‌గా పరిచయం అయి పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది.

దిశ, సినిమా: టాలీవుడ్ నటి రేణు దేశాయ్(Renu Desai) గతంలో హీరోయిన్‌గా పరిచయం అయి పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ను పెళ్లి చేసుకుని ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొద్ది కాలం పాటు ఇండస్ట్రీలో నటిగా కొనసాగింది కానీ అంతగా హిట్స్ సాధించలేకపోయింది. ఇక పవన్ కళ్యాణ్‌తో మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకుని విడిపోయింది. ఆ తర్వాత కొద్ది కాలం పాటు తన పిల్లల బాధ్యత తీసుకుని సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ చాలా రోజుల తర్వాత ‘టైగర్ నాగేశ్వర రావు’(Tiger Nageswara Rao) మూవీతో రీఎంట్రీ ఇచ్చింది.
కానీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే ఆమె పోస్టులు నెట్టింట ఫుల్ వైరల్ అవుతాయనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల ఓ ట్రస్ట్ స్టార్ట్ చేసి దాని ద్వారా జంతువులకు సాయం చేస్తోంది. కానీ సినిమాల్లోకి మాత్రం రీ ఎంట్రీ ఇవ్వడం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. రాజమండ్రిలోని మంచి వ్యక్తులు దయచేసి సహాయం చేయండి. మీరు సహాయం చేయగలిగితే ఈ ఫోన్ నెంబర్‌కు కాల్ చేయండి’’ అనే క్యాప్షన్ జత చేసి ఓ కుక్క గాయపడిన ఫొటో షేర్ చేసింది. అలాగే చేతులెత్తి దండం పెట్టిన ఎమోజీని పోస్ట్‌లో పెట్టింది.






