- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HHVM: పవన్ కల్యాణ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్
ఏపీలోని వెస్ట్ గోదావరి పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రబృందం శుభవార్త చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని వెస్ట్ గోదావరి పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రబృందం శుభవార్త చెప్పింది. ట్రైలర్ విడుదల చేయబోయే నైజాం థియేటర్ల లిస్టును విడుదల చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టింది. ఇందులో ఏలూరులోని ఎస్‌వీసీ, భీమవరంలోని ఏవీజీ, తనుకులోని వీమాక్స్, తాడేపల్లి గూడెం, పాలకొల్లు సహా రాష్ట్రంలోని పలు జిల్లాల థియేటర్లలో ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. జులై 3వ తేదీన ఉదయం 11:10 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. హరిహర వీరమల్లు పార్ట్-1ను జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇందులో పవన్ చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్(Nidhi Agarwal). బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం నిర్మించారు.






